సహజీవనం చేసి భాగస్వామి నుంచి విడిపోయిన మహిళలూ భరణం పొందేందుకు అర్హులేనని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పురుషులతో చట్టబద్ధంగా వివాహం కాకున్నా.. నిర్దిష్ట కాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళలు కూడా భరణం పొందవచ్చని స్పష్టంచేసింది. సహజీవనం వంటి బంధాల్లో మహిళల దుర్బలత్వాన్ని, హక్కులను ఈ తీర్పు గుర్తిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.