పెద్ద జంతువైనా చివరకు ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహాలు కూడా వేటలో భాగంగా గాయాలపాలవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ మిగతా జంతువులను భయభ్రాంతులకు గురి చేసి ఆహారాన్ని సంపాదించుకోగలవు. కాలు కుంటుతున్న ఓ సింహం.. రాబందులు, హైనాలను హడలెత్తించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అడవిలో ఓ ఏనుగు చనిపోవడంతో రాబందులు, హైనాలు గుంపులుగా చేరి, దాని మాంసాన్ని పీక్కుతింటుంటాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలు దెబ్బతిన్న ఓ సింహం.. వేటాడే ఓపిక లేక సులభంగా దొరికే ఆహారం కోసం వేచిచూస్తుంటుంది. ఆ సమయంలో దానికి చినపోయిన ఏనుగు వద్ద రాంబదులు, హైనాలు కనిపిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగు పరుగున అక్కడికి వస్తుంది. సింహం రాకను గమనించిన రాబందులు, హైనాలు అక్కడి నుంచి పరారవుతాయి. అలా వాటిని అన్నింటినీ భయపెట్టిన సింహం.. తర్వాత తాపీగా ఏనుగు మాంసాన్ని లాగించేస్తుంది. ఎలాగున్నా సింహం.. సింహమే..