ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యేది. గత నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1వ తేదీన జీతాలు పడతాయా? లేదా? అనే సందేహాలన్నింటికి సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా జులై 1వ తేదీనే ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోయారు.