మహేశ్‌బాబు సోదరి మంజుల.. జుట్టు పట్టుకుని లాగడం, దానికి మహేశ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నెటిజన్లను ఆకర్షించాయి. కానీ, మంజులను మహేష్ ఏమన్నారో ఎవరికీ తెలియదు. మహేశ్ కుమార్తె సితార నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు. సితారతో వారు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘మీ డాడీ జుట్టుని మీ అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?’ అని అడగ్గా.. ‘నా జుట్టు పట్టుకోవద్దు’ అని మహేశ్ అన్నారని సితార చెప్పింది. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం తన తండ్రికి ఇష్టం ఉండదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ సంఘటన చోటు చేసుకుంది.