ఒక గ్రామ జనాభా అంత సెక్యూరిటీ జగన్ కావాలని అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత అవసరమా..? అని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. జగన్‌కి ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నాం. తాము ఎక్కడ జగన్ భద్రత తగ్గించలేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష హోదా కావాలి… భద్రత కావాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేయడం రాజకీయ లబ్ధి కోసమే. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్‌కి తెలియదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, వైసీపీ హయాంలో జరిగిన హత్యలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమంగా సస్పెండ్ చేశారంటూ పలువురు పోలీసులు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు.