అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపింది. దీంతో సదరు సంస్థకు రూ.90 లక్షల జరిమానా విధించింది. దీనికితోడు ఎయిర్ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ.3 లక్షల చొప్పున ఫైన్ విధించింది. లోపాలపై సంస్థ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ముంబయి నుంచి రియాద్‌కు జులై 9న ఎయిర్ఇండియా ఓ విమానం నడిపింది. ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి పైలట్ డ్యూటీలో ఉండాలి. కానీ ట్రైనింగ్ కెప్టెన్‌కి ఆరోగ్య సమస్యలు రావడంతో.. రోస్టరింగ్ విధానంలో నార్మల్ లైన్ కెప్టెన్ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇచ్చే అర్హత ఆయనకు ఉండదు.దీంతో ట్రైనీ పైలట్, కెప్టెన్ బేస్ మేనేజర్‌కు రిపోర్ట్ చేశారు. తరువాత ఈ వివాదంపై డీజీసీఏకు నివేదిక అందింది. డీజీసీఐ పరిశీలించి భారీ మొత్తంలో ఫైన్ విధించింది.ఈ ఏడాది ఎయిర్ ఇండియాకు ఫైన్ పడటం ఇది రెండో సారి.