తండ్రి పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తుండగా దగ్గరుండి చూసేందుకు పవన్ కొడుకు అకీరా, కుమార్తె ఆద్య ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో సిద్ధమయ్యారు. తల్లి రేణూదేశాయ్తో వీడియో కాల్లో మాట్లాడారు. వారి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ, నాన్నకు ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ ఎంత ఆనందంగా రెడీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలనే ఆకాంక్షించే కళ్యాణ్‌కు శుభాకాంక్షలు అని రేణూ పోస్ట్ చేశారు.