చిరంజీవి, వెంకయ్య నాయుడుకుతో పాటు మరికొంతమంది కవులకు, కళాకారులకు కేంద్రప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మారుమూల గ్రామాల్లో ఉండి వారి ఎంచుకున్న కళలకు జీవితాంతం సేవ చేసినందుకు వారికి పద్మ అవార్డులు వచ్చాయి. ‘‘చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ రావటం సముచితం. కవులకు,కళాకారులకు అవార్డు వస్తున్నాయి కానీ ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీత కు పాతిక లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటిస్తున్నాం. కళలను బ్రతికించుకోవాలంటే అందరూ రాజకీయాలకతీతంగా ముందుకు రావాలి అన్నారు రేవంత్ రెడ్డి.