రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం కంటే ఖర్చే చాలా ఎక్కువగా ఉంటోందని, ఈ అంతరం నానాటికీ పెరిగిపోతోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. పన్నులు తదితరాల రూపేణా రోజుకు సగటున రూ. 483 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఖర్చు మాత్రం రూ.655 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. అంటే రోజుకు రూ.172 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. మన రాష్ట్రం అప్పులపై నిత్యం రూ.78 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. శనివారం గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి – కార్యాచరణ అంశంపై నిర్వహించిన చర్చావేదికలో రమేష్ తెలిపారు. ‘వైకాపా పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అప్పులు రూ.14 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. గత ఐదేళ్లలో పాలకులు అభివృద్ధిపై దృష్టి సారించలేదని రమేష్ విశ్లేషించారు.