అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏడు నెలల క్రితం ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్తో మొదలైన పెళ్లి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన వేలాది ప్రముఖులు అనంత్ -రాధిక పరిణయానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెళ్లి ఆశీర్వాదం ఇచ్చారు. ఇంతకీ ఈ వేడుకకు సుమారు 5 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం. వైభవంగా అనంత్ వివాహాన్ని జరిపిస్తున్న ముకేశ్ అంబానీ.. ఈ వేడుక కోసం చేసిన ఖర్చుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.