‘వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఢల్లీిలో బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాష్ట్రం వదలి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి న్యాయపరంగా శిక్షిస్తాం’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ‘ధర్మారెడ్డి టీటీడీని అవినీతిమయం చేశావు. స్వామి వారి హుండీని జగన్ హుండీగా మార్చేశావు. రూ.రెండు వేల కోట్లు శ్రీవాణి ట్రస్టు డబ్బులను ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టే అధికారం ధర్మారెడ్డికి ఎవరిచ్చారు? పింక్ డైమండ్ పోయిందని టీటీడీ పెట్టిన కేసును ధర్మారెడ్డి నీరు గార్చేందుకు ప్రయత్నించారు. టీటీడీ భూములను శారదాపీఠానికి కట్టబెట్టే అధికారం ధర్మారెడ్డికి ఎవరిచ్చారు? జూన్ 4 తర్వాత సజ్జల హైదరాబాద్ వెళ్లిపోతారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తాగి ఒళ్లు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు’ అని ఆనం మండిపడ్డారు.