ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారు. ఆ టీమ్ సభ్యులు వస్తేనే వణికిపోతున్నారు. ఏం చెబుతారో.. తమను ఏం చేయమంటరోనని భయ పడిపోతున్నారు. ఎన్నికల వేళ అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐ ప్యాక్ సభ్యులు అది చేయండి, ఇది చేయండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏ నియోజకవర్గం అయినా సరే ప్రలోభాలకు గురిచేయాలి. ఖరీదైన కానుకలు ఇచ్చి వాలంటీర్లను చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. నియోజకవర్గాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తే వ్యతిరేకతను తప్పించుకోచ్చని కోరారు. ఎంత డబ్బు పంచాలో కూడా లెక్కలు వేసి వివరిస్తున్నారు. ఇలా వారు అన్నింటి గురించి తమకు చెప్పడం ఏంటని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఐప్యాక్ సభ్యులు చెప్పినట్టే చేస్తే రాజకీయం చేయలేమని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఒకవేళ ఐ ప్యాక్ సభ్యులు చెప్పినట్టే చేస్తే ఓటమి ఖాయం అని అంటున్నారు.