బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లోని సావో పాలోలో అరండోలో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవును 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు.అంటే ఈ ఆవు రూ.40 కోట్లు ధర పలికింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలు జాతి ఆవులను వయాటినా 19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ అని పిలుస్తారు. ఈ అవులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.1868లోనే ఒంగోలు మేలు జాతి ఆవుల జంటను బ్రెజిల్‌కు తరలించారు. నాటి నుంచి ఈ జాతి ఆవుల వృద్ధికి ఆ దేశం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఈ జాతి ఆవులు నేటికి16 మిలియన్ల వరకు ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుపు రంగులో ఉండి.. చూడడానికి చాలా బలిష్టంగా కనిపించడం ఈ జాతి ఆవుల ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో ఈ మేలు జాతి ఆవులకు ప్రసిద్ధి.