సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌పై ఫీల్డ్ అంఫైర్ ధర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రెండు, మూడు సార్లు పరిశీలించిన తర్వాత అవుట్‌గా ప్రకటించారు. దీంతో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ పట్టడంతో.. భారత్ డకౌట్లో ఆనందం కనిపించింది. మరోవైపు సౌతాఫ్రికా ఆటగాళ్లతో పాటు.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ పూర్తైన తర్వాత ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. సూర్యకుమార్ యాదవ్ షూ బౌండరీ లైన్‌ను తాకిందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. థర్డ్ అంపైర్ బిగ్ స్క్రీన్‌లో చూసిన తర్వాత తుది నిర్ణయం వెల్లడిరచాడు. అయినప్పటికీ మరో రెండు మూడు సార్లు పరిశీలించి ఉండాల్సిందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ భారత్ గెలుచుకున్నప్పటికీ.. సూర్యకుమార్ క్యాచ్ చుట్టూ వివాదం నడుస్తోంది. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.