కాంగ్రెస్ తన కులాన్ని తిట్టిందని.. తనను దూషించడం తప్ప ఆ పార్టీకి మరో ఎజెండా లేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎంత ఎక్కువ బురదజల్లితే.. అంతగా 370 కమలాలు వికసిస్తాయని పేర్కొన్నారు. గుజరాత్లోని నవ్సారి, మోహసానా జిల్లాల్లో గురువారం మోదీ విస్తృతంగా పర్యటించారు. రూ.8,350 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ కాంగ్రెసపై మండిపడ్డారు. 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్న అమూల్ ఉత్పత్తులు పాడి రైతుల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటాయన్నారు.