ప్రస్తుతం కల్కీతో దూసుకుపోతున్న ప్రభాస్ గురించి నాలుగు మాటలు.. ప్రభాస్ నలుగురిలో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడతాడు. సోషల్ మీడియాలోనూ అంతే. ప్రభాస్ ఇన్‌స్టాను ఒకసారి పరిశీలిద్దాం.. ప్రభాస్‌కు ఇన్‌స్టాలో 12.5 లక్షల మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాని ఆయన కేవలం 18 మందినే ఫాలో అవుతాడు. వీరిలో అతని పెదనాన్న కృష్ణంరాజు ఖాతా ఉంటుంది. తనతో కలిసి నటించిన హీరోయిన్లు శృతిహాసన్, కృతి సనన్, దీపిక పదుకొనె, పూజాహెగ్గే, శ్రద్ధాకపూర్‌తోపాటు రాధేశ్యామ్‌లో తనకు తల్లిగా నటించిన భాగ్యశ్రీ కూడా తన ఫాలోయింగ్ లిస్ట్‌లో ఉన్నారు. నటుల్లో అమితాబ్, కమల్‌హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, సన్నీ సింగ్. దర్శకుల్లో నాగ్ అశ్విన్, ఓం రౌత్, సుజిత్, రాధాకృష్ణ, మారుతీ, సందీప్ వంగతోపాటు ఫిల్మ్ ఎడిటర్ డానీ బ్రకమెండోస్ను ఫాలో అవుతారు. ఇన్‌స్టాలో తన సినిమాల అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు కనిపించవు. అతికొద్ది మందికి మాత్రమే బర్త్‌డే విషెష్ ఉంటాయి. ఇప్పటివరకు ప్రభాస్ 226 పోస్టులు మాత్రమే పెట్టాడు. ఇలా ప్రభాస్ ఇన్‌స్టా అంతా ప్రత్యేకమే.