విదేశాల్లో లైఫ్‌కి భారత్‌లో జీవితాన్ని పోల్చుతూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. నీహారికా కౌర్ సోధీ అనే యువతి ఈ పోస్టు పెట్టింది. భారత్‌లో ఉన్నప్పుడు తనకు విలాసవంతమైన జీవితం అంటే ఏంటనే దానిపై ఓ అభిప్రాయం ఉండేదని, అమెరికాకు వచ్చాక ఆ అభిప్రాయంలో మార్చు వచ్చిందని చెప్పుకొచ్చింది. భారత్‌లో ఉండగా నాకు లగ్జరీ లైఫ్ అంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు, గ్రాసరీ డెలివరీలు, ఇంటిపనుల కోసం తక్కువ ఖర్చులో లభించే సహాయకురాలు.. వంటి అభిప్రాయాలు ఉండేవి. కానీ అసలు నాణ్యమైన జీవితం అంటే శుభ్రమైన గాలి, నిరంతర విద్యుత్ సరఫరా, మంచి నీరు, చుట్టూ పచ్చదనం, మంచి రోడ్లు అని అమెరికాకు వచ్చాక అనిపించింది. అసలు లగ్జరీ అంటే విద్యుత్ కోతల్లేకుండా ఏసీ నిత్యం అందుబాటులో ఉండటం. మగ చూపుల ఇబ్బంది లేకుండా నచ్చిన డ్రెస్ వేసుకుని తిరగడం’’ అని ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది యువతితో ఏకీభవించారు.