‘స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేసేశారు’ అని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం ఆయన విశాఖకు వచ్చారు. నగరంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన వ్యాపార ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం నర్సీపట్నం వెళ్లారు. ముందుగా విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెం దిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖ, నర్సీపట్నంలో అయ్యన్న మాట్లాడుతూ… ‘నాకు 40 ఏళ్ల కిందట ఎన్టీ రామారావు మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇచ్చి గౌరవించారు.