న్యూఢల్లీి, దీక్షమీడియా:
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వచ్చింది. విచారణలో భాగంగా రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం త్రోసిపుచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనపై కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు డిసెంబరు 8కి వాయిదా వేసిన సుప్రీం.
Leave a comment
Leave a comment