కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలుమోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి. సోమవారం నుంచి దాదాపు 45 కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులతో టచ్లోకి వచ్చాయి. తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం 132 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. వీటిలో కేంద్ర సంస్థలు 45 వరకూ ఉన్నాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత అమరావతి విధ్వంసానికి పాల్పడిరది. దీంతో గత ఐదేళ్లు కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేకపోయాయి.