కర్నూలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రేటు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఉల్లి ధర రూ.3800 నుంచి రూ.4500 వరకు జరుగుతున్నాయని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో మండ్లెం గ్రామంలో ఉంకూరు శివశంకర్ రెడ్డి ఆరు ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. ఈ సారి పంటల్లో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అధికంగానే లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లికి అధిక ధరలు పలకడం వలన రైతన్నలకు లాభదాయకంగా ఉంటుందన్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి ఉల్లికి ఆశించినంత రేటు లేకపోవడంతో రైతన్నలు తీవ్ర అప్పుల పాలు కావడం జరిగిందన్నారు. వాటికి వడ్డీ కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు.కాకపోతే ఈ సంవత్సరం క్వింటాఉల్లి రూ. 3800 నుంచి రూ.4500 పలుకుతుందని రైతులకుకు గిట్టుబాటు ధర వచ్చిందన్నారు.కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి నష్టాన్ని రైతులు కట్టుకోవాలంటే. ప్రభుత్వాలు మరింత రేటును పెంచాలని రైతులు కోరుకుంటున్నారు.
ఉల్లి రైతులకు కాసుల పంట…
Leave a comment
Leave a comment