జనసేన సీట్ల లెక్క తేలిపోయింది. ఎవరు ఎక్కడా, ఏ నియోజకవర్గాలు అనేది కూడా తుది దశకు చేరింది. సీట్ల పంపిణీలో ఎక్కడా వివాదాలు లేవు.. అంతా సవ్యంగా జరిగింది. కార్యకర్తలు కూడా ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. 24 స్థానాల్లో విజయం సాధించాలి.. అదే జనసేనకు టాస్క్.. జనసేన అధినేత పవన్ కార్యకర్తలకు దిశనిర్దేశం చేస్తూ యుద్ధానికి సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరగనున్న ఉమ్మడి భారీ బహిరంగ సభకు తరలిరావాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను చూస్తేనే వైసీపీకి వణుకు పుడుతోంది. ఒకరోజు ముందుగానే అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. సభ అనంతరం ఎవరు ఎక్కడా అనేది నిర్ధారణ అవుతుందని జనసేన నేతలు చెబుతున్నారు.
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తే నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుండగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తొమ్మిది స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు జనసేనకు దక్కే అవకాశముంది. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ కావాలని ఆ పార్టీ కోరుతోంది. ఇక అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడైతే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. కానీ అక్కడ టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే తెనాలి నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ సీట్లలో ఒకటి ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో మూడు స్థానాలపై దృష్టి పెట్టింది. కనీసం రెండైనా ఇవ్వాలని అడుగుతోంది. దర్శి సీటు దాదాపు జనసేనకు ఖరారు అయింది. అక్కడనుంచి గరికపాటి వెంకట్‌ను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.రెండో సీటుగా గిద్దలూరు లేదా చీరాల అడుగుతోంది. గిద్దలూరులో కాపు ఓటిం గ్ శాతం ఎక్కువే అయినా… ఈ సీటు తీసుకుంటే మాత్రం ముస్లిం అభ్యర్థికి కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చీరాల దక్కితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములును అభ్యర్థిగా ఖరారుచేసే అవకాశాలున్నాయి. జనసేన రాయలసీమలో ఆరు స్థానాలపై దృష్టి పెట్టింది. ఇందులో మూడు దక్కే వీలుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి సీట్లను జనసేన కోరుతోంది. ఇందులో రెండైనా దక్కుతాయని భావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా పొత్తులో ఆ సీటు కోరే అవకాశం ఉంది. అనంతపురం టౌన్ సీటు జనసేనకు ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. పుట్టపర్తి సీటు కూడా అడుగుతున్నట్లు తెలిసింది, కడప జిల్లాలో రాజంపేట లేదా బద్వేల్ నుంచి ఆ పార్టీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
లెక్క పక్కా..! ఫైనల్ మ్యాచ్‌కు జనసేన రెఢీలెక్క పక్కా..!
Leave a comment
Leave a comment