ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆనంద్ మహీంద్రా కంపెనీకే చెందిన బొలేరో వాహనానికి కొత్త టెక్నాలజీ జోడిరచి నడుపుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను ఆనంద్ షేర్ చేశారు. డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా నడిచే కార్లకు మంచి డిమాండ్ ఉంది. అమెరికాలో టెస్లా కార్లు ఇదే టెక్నాలజీతో నడుస్తున్నాయి. ఇండియాలోను ఇటువంటి కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా బోపాల్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఆటోమోటివ్ టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలోని బొలేరో వాహనం తనంతట తానుగానే బిజీ రోడ్డుపై ప్రయాణం చేస్తోంది.