సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది.