వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు క్యూ కట్టారు. నాలుగో రోజు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టుపై అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బౌలర్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ రికార్డును బ్రేక్ చేశాడు. చంద్రశేఖర్ 95 వికెట్లు తీయగా.. 96 వికెట్లతో అశ్విన్ అతడిని అధిగమించాడు.భగవత్ చంద్రశేఖర్ 1964 నుంచి 1979 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో 45 ఏళ్ల తర్వాత భగవత్ చంద్రశేఖర్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో మరొక వికెట్ తీస్తే 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.