టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియమితులయ్యారు. అయితే గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమించే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సమాచారం ఇవ్వలేదని సమాచారం. సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీని బీసీసీఐ విస్మరించడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా బీసీసీఐ.. గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసింది. అయితే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వస్తాడనే వార్తలు వినిపించనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక విషయంపై ఎక్కువగా చర్చ జరిగింది.ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ పెద్దది కావడంతో మైదానంలోనే కోహ్లీ, గంభీర్‌లు గొడవపడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.