అపోలో గ్రూపు హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. సరకుల లోడుతో వెళుతున్న వ్యాను ప్రతాప్ రెడ్డి కారును ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్, క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం రాత్రి చెన్నైలోని థౌజండ్లైట్లోని అపోలో ఆస్పత్రి నుంచి ప్రతాపరెడ్డి కారులో ఇంటికి వెళ్తుండగా అన్నాసాలై ప్రాంతంలో వేగంతో వచ్చిన వ్యాను కారును ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటనపై ప్రతాప్ సి రెడ్డి భద్రతా విభాగం మేనేజర్ సంతోష్ నాయర్ థౌజండ్లైట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.