అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది.. ఇంకా పొదుగుతూనే ఉంది. వైకాపా కోడి.. ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్‌ను ఇచ్చింది. కానీ, ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన ప్రసంగం కేక పుట్టించింది.