ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా డబ్బులు రావడానికి ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అలాంటి సమయంలో డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తరువాత నగదు ప్రత్యక్షమైన ఘటన పాతబస్తీ హషామాబాద్లో చోటుచేసుకుంది. బండ్లగూడ ఠాణా ఏఎస్సై ఎం.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం… చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్ టవర్గల్లీ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో రూ.20వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఏఎస్సై, సిబ్బంది ఏటీఎంలో డ్రా చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులకు అప్పగిస్తామని, ఖాతాదారుడు ఆధారాలతో వచ్చి తీసుకోవచ్చని ఏఎస్సై చెప్పారు.