అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రస్తుతం ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు ఎన్ని కట్టినా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. 2030 నాటికి ఈ సమస్య మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచనతో వచ్చింది ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ. అందుకోసం ఎయిర్ ట్యాక్సీలను రంగంలోకి దించబోతోంది. ఈ ఎయిర్ ట్యాక్సీలేంటి. అనుకుంటున్నారా.. ఎయిర్ ట్యాక్సీలు కంప్లీట్ డిఫరెంట్. ఈ ట్యాక్సీల్లో అయిదుగురుతో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. త్వరలో భారత్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది.