తమిళనాడు కళ్లకురిచ్చి జిలాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ పరామర్శించారు.ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.