పారిస్ ఒలంపిక్స్‌లో అమెరికా, చైనా నువ్వా నేనా అంటూ పతకాల పోరులో పోటీపడ్డాయి. చివరకు పసిడిలో చెరో 40 పతకాలు సాధించి సమానంగా నిలిచారు. అయితే మొత్తంగా చూస్తే 126 పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 90 పతకాలతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. కాగా, ట్రాక్ అండ్ ఫీల్డ్స్‌లో స్వర్ణం సాధించిన పిన్న వయసు అమెరికా అథ్లెట్‌గా 16 ఏళ్ల క్విన్సీ విల్సన్ రికార్డులకెక్కాడు. 4 గీ400 రిలేలో అమెరికా పసిడి పతకం నెగ్గింది. తొలి రౌండ్లో ఫస్ట్ లెగ్‌లో పాల్గొన్న విల్సన్‌కు ఫైనల్లో పరిగెత్తే అవకాశం దక్కలేదు. కానీ, జట్టు సభ్యుడిగా అతడికి కూడా బంగారు పతకం లభించింది.