నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లవుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్బాబు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు శుక్రవారం మాట్లాడారు. ‘1995 సెప్టెంబరు 1న చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం కావడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు. ఆయన సీఎంగా గాక సీఈవోగా దేశమంతటా గుర్తింపు పొందారు. మన తరంలో చంద్రబాబు దార్శనికుడని కృష్ణప్రసాద్ కొనియాడారు. ‘జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.రాబోయే రోజుల్లో వైసీపీకి జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల తప్ప మరెవరూ మిగలరు. పార్టీని నిలుపుకోవడానికి రాబోయే రోజుల్లో జగన్ దుష్ప్రచారాలకు తెరదీస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపిచ్చారు.