టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై యూఎస్ఏ అద్భుత విజయం సాధించడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. న్యూయార్క్ బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్ తిలకించిన కొందరు ఫ్యాన్స్.. సూపర్ ఓవర్లో అమెరికా గెలవగానే హంగామా చేశారు. ‘యూఎస్ఏ.. యూఎస్ఏ..’ అంటూ అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో అంతగా ఆదరణ లేని క్రికెట్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఆ దేశంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది.