టాలీవుడ్‌లోని చిన్న హీరోలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోన్న హీరో సుహాస్. ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ మినిమమ్ సక్సెస్ రేట్‌ని అందుకుంటున్నాయి. ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్నవదనం’ సినిమాలు మంచి ఆదరణను పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనతో పాటు ‘బేబి’ ఫేమ్ విరాజ్ అశ్విన్ , ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్‌రత్నం నటించిన ‘శ్రీరంగనీతులు’ మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతూ.. బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. రుహానీ శర్మ ఇందులో హీరోయిన్గా నటించింది.‘శ్రీరంగనీతులు’ కథ విషయానికి వస్తే ఒకరు గొప్ప కోసం.. మరొకరు ప్రేమ మధ్య ఆసక్తిగా సాగుతుంది.