ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్న వారికి గుడ్ న్యూస్. మ్యాచ్ ఆలస్యమైంది.. ఇంటికి వెళ్లడమెలా? ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే.. నైట్ టైమ్ కాబట్టి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించనున్నారు. అర్ధరాత్రి 12:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని తెలిపారు. తెల్లవారుజామున 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. నాగోల్ , ఉప్పల్, స్టేడియం, ఎన్జిఆర్ఐ స్టేషన్లలో మాత్రమే షెడ్యూల్ గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి ఉంది.