ప్రస్తుతం కొన్ని దేశాలు అధికజనాభాతో ఇబ్బంది పడుతుంటే మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పడిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాయి. జంటలను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు నానా యాతనా పడుతున్నాయి. దక్షిణకొరియాకు చెందిన బూయంగ్ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా దేశంలో సంతానోత్పత్తి రేటుపై ఆందోళన చెందుతోంది. ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డల్ని కన్న ప్రతి ఒక్కరికీ బిడ్డకు రూ.62.3 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. అంతేకాదు, ముగ్గురికి మించి సంతానం ఉన్న జంటలకు అదనంగా రూ.1.8 కోట్లు లేదా వాళ్లు ఉండేందుకు ఓ ఇల్లు కట్టిఇస్తామని కూడా పేర్కొంది. సంస్థ చైర్మన్ సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆఫర్ను ప్రకటించారు.