ప్రభాస్ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘కల్కి’కన్నా ఈ రికార్డును సాధించిన భారతీయ చిత్రాలు ఆరు ఉండగా, ‘కల్కి’నెంబర్ 7. ఇక నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. 16.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. బుక్ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగా రికార్డు సృష్టించింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాలు ఏమిటో చూద్దాం.. దంగల్ (2016) రూ.2024 కోటు,్ల బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు