ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లోని మోతిహారి నుంచి ఢల్లీికి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని బంగార్మావు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. అక్కడ దాదాపు 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రుల చికిత్స స్థితిగతులను స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.