ప్రస్తుతం జరుగుతున్న ‘మహా కుంభమేళ’లో చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుంది. సాధారణ మనుషులు సెలబ్రిటీలు అవుతుంటే.. సెలబ్రిటీలు సాధారణ మనుషులు అవుతున్నారు. తాజాగా ఓ సెన్సేషనల్ బాలీవుడ్ బ్యూటీ సన్యాసినిగా మారింది. ఆమె తెలుగులోను స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.ఆ బ్యూటీ ఎవరంటే.. మమతా కుల్కర్ణి.. మహారాష్ట్రలో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.మహా కుంభమేళ సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె కిన్నెర అఖాడాలో చేరింది. అనంతరం తన పేరును యమాయ్ మమతా నందగిరిగా మార్చుకుంది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి ఆధ్వర్యంలో సన్యాస దీక్ష స్వీకరించారు. ఆమె ఉద్వేగంతో మాట్లాడుతూ ‘‘మళ్లీ సినిమాలు చేయడం అసాధ్యం. మీరెప్పుడూ మీ అవసరాలను గుర్తించాలి. కానీ, ఆధ్యాత్మిక భావన అనేది పూర్తిగా అదృష్టం ఉంటేనే కలుగుతుంది. సిద్ధార్థుడు జీవితంలో అన్నీ చూసిన తర్వాతే మారాలని నిశ్చయించుకున్నాడు. గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు. ఇది మహాదేవ్.. మహాకాళి ఆజ్ఞ, నా గురువుల ఆదేశమంటూ చెప్పుకొచ్చారు.