![](https://deekshamedia.com/wp-content/uploads/2025/01/For-Web.jpg)
సుమారు ఏడు మాసాల పాటు ఏపీ డీజీపీ గా విధులు నిర్వర్తించిన తాను ఎంతగానో సంతృప్తి చెందానని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళ గిరి లోని పోలీస్ ప్రధాన కార్యాల యంలో అయన మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్ళ కు పైగా పాటు పోలీస్ అధికారిగా పని చేసిన అనుభవం లో ఎన్నో సవాళ్ళ ను అధిక మించా నని తెలిపారు. తనకు సహకరిం చిన మీడియాతో పాటు రాష్ట్ర ప్రజలకు అయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఏడు మాసాల డీజీపీ హయాంలో ఒక్క సైబర్ నేరాలలో తప్ప అన్ని ఇతర నేరాలను నియంత్రించినట్లు పేర్కొ న్నారు. గత ఆగష్టు, సెప్టెంబర్ లో వచ్చిన వరదల్లో బాగా పని చేసాం అని చెప్పారు. సాంకేతికత ను ఎప్పటికప్పుడు అందిపుచు కుంటూ క్రైమ్ రేట్ ను తగ్గించు కుంటూ వచ్చామని అన్నారు.
మహిళలు, చిన్నారుల పై జరిగిన నేరాలపై కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టి, నియంత్రించామని వివరించారు.
సీసీ కెమెరాల వాడుకపై కూడా అవగాహన కల్పించి, రానున్న మార్చి నెల 31 కల్లా లక్ష సీసీ కెమెరాలు పెట్టాలనేదే తమ లక్ష్యం అని చెప్పారు. డ్రోన్ ల వినియోగం పై కూడా పెంచి, నేరాల నియంత్రణ కు డ్రోన్ లను వినియోగించే దిశగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖలో కూడా అనేక మార్పులు చేశాము అని, సిబ్బంది సంక్షేమానికి ఎంతగానో కృషి చేసినట్లు డీజీపీ తెలిపారు. అలాగే గంజాయి నిర్ములనపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టినట్లు పేర్కొన్నారు………