![](https://deekshamedia.com/wp-content/uploads/2025/01/Rashmika-For-Web.jpg)
స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. తాజాగా ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన హిందీ చిత్రం ప్రచారంలో పాల్గొనడం కోసం ముంబయి బయల్దేరినట్లు తెలుస్తోంది. కారులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రష్మిక తన టీమ్ సాయంతో వీల్‌ఛైర్‌లో విమానాశ్రయం లోపలికి వెళ్లారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.తనకు గాయమైనట్లు తెలుపుతూ ఇటీవల రష్మిక ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యాన్ని క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూట్లో భాగం అవుతా’’ అని దానిలో తెలిపారు.