1853, ఏప్రిల్ 16, బరి బందర్ (ముంబై), మధ్యహ్నం 3.45 గంటలకు భారత దేశంలో మొట్ట మొదటి రైలు పట్టాలపై పరుగులు పెట్టిన రోజు అది.. వేలాది మంది ప్రజలు కన్నార్పకుండ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. పెద్ద శబ్దం చేసుకుంటూ.. భారంగా ఆ రైలు… కదలడంతో జనాలంతా.. ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. మూడు బొగ్గు ఇంజన్లు, తొమ్మిది రైలు పెట్టెలతో దాదాపు 400 మంది ప్రయాణికులతో చిన్నగా బయలుదేరిన ఆ రైలు.. 34 కీ.మీ. దూరంలో వున్న థానేకు క్షేమంగా చేరుకుంది. ఇదీ.. భారతీయ రైల్వే తొలి రైలు ప్రస్థానం. 1853 నుంచి 2025..వరకు, ఈ 172 ఏళ్ల ప్రయాణంలో భారతీయ రైల్వే ఎన్నో ఆటు పోట్లును ఎదుర్కోంది. బొగ్గుతో నడిచే రైలింజన్ స్థాయి నుంచి.. బుల్లెట్ రైలు స్థాయికి ఎదిగింది. ఇంకా చెప్పాలి అంటే.. హైట్రోజెన్తో నడిచే రైలింజన్లు కూడా వచ్చేస్తున్నాయి. ప్రపంచ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే 4వ స్థానంలో నిలిచి.. శరవేగంగా దూసుకు పోతోంది.
172 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వే.. వందేభారత్ రైళ్లతో మరింత ప్రతిష్టను పెంచుకుంది. 2019,ఫిబ్రవరి 15న వందేభారత్ రైళ్ల ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ రైళ్లకు కేవలం ఏసీ చైర్, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు మాత్రమే వున్నాయి. స్లీపర్ క్లాస్ సౌకర్యంతో వందేభారత్ స్లీపర్ రైళ్ల ను డిజైన్ చేశారు. న్యూఢల్లీి నుంచి శ్రీనగర్ ఈ రైలు 180 కీ.మీ. వేగంతో, ఎటువంటి కుదుపులు లేకుండా, విమానంలో ప్రయాణించినంత హాయిగా.. ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకు వెళ్ళనుంది.
ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయంగా చెప్పుకునే వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయిల్ రన్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో ఈ రైలును 180 కీ.మీ. వేగంతో నడిపారు. రైలు ప్రయాణ సమయంలో ఒక గాజు గ్లాస్లో నిండుగా నీళ్లు పోసి.. పరీక్షించారు. గ్లాస్లో నీళ్లు చుక్క కూడా క్రింద పడలేదు. ఇదే విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పోస్ట్‌ను పెట్టి.. హర్షం వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోని స్థితిలో వున్న భారతీయ రైల్వే వ్యవస్థను రౖౖెల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ గత పదేళ్ల నుంచి పరుగులు పెట్టిస్తున్నారు. వందేభారత్ రైళ్ళే అద్భుతం అనుకుంటే.. అంతటితో ఆగకుండా.. బుల్లెట్ రైళ్లను కూడా నడపటానికి.. పచ్చ జెండా ఉపేశారు. జపాన్ సహకారంతో..ముంబై – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైళ్ల ను నడపటానికి ప్రణాళికలు సిద్ధం చేయటమే కాకుండా, పనులు కూడా ప్రారంభించారు.508 కీ.మీ. దూరం వున్న ఈ ప్రాజెక్ట్ పనులు చక చక జరుగుతున్నాయి. గంటకు 320 కీ.మీ. వేగంతో ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.24 రివర్ వంతెనలు, 28 ఉక్కు వంతెనలు, 7 సొరంగ మార్గాలతో పాటు, సముద్ర గర్భంలో 7 కీమీ. పొడవైన టన్నెల్ ను కూడా నిర్మించనున్నారు. గుజరాత్లో 8 రైల్వే స్టేషన్లతో, కలిపి 352 కీ.మీ. ఉండగా, మహారాష్ట్ర ో 4 స్టేషన్లతో 156 కీ.మీ.ల ట్రాక్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 20శాతం పనులు పూర్తి అయ్యాయి. అనుకున్నట్లు జరిగితే.. 2029కు.. బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.
భారతీయ రైల్వేలలో 7వేలకు పైగా రైల్వే స్టేషన్లు వున్నాయి. వీటిలో చాలా వరకు కనీస సౌకర్యలు కూడా లేని స్టేషన్ లు వున్నాయి. సూపర్ ఫాస్ట్ రైళ్ళతో పాటు, వందేభారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో రైల్వే స్టేషన్ ను కూడా ఆధునికరించాలనే లక్ష్యంతో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ను ఏర్పాటు చేసి, రూ. 25 వేల కోట్లను కేటాయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 453.3 కోట్ల ను కేటాయించారు.మొత్తంగా రైల్వే రూపురేఖలు మారనున్నాయి అనడంలో సందేహం లేదు
బొగ్గు నుంచి..బుల్లెట్ రైలు వరకు..భారతీయ రైల్వే రూపు రేఖలు మారుతున్నాయ్..జనవరి 26 న వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
Leave a comment
Leave a comment