మీరు మీ జీవితంలో మార్పును కోరుకుంటే, కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. వాటిలో నుంచి ఓ మంచి ఐడియాను తీసుకుని అమలు పరిస్తే మీ జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఇటివల ఇద్దరు కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించారు. అంతే అది క్లిక్ కావడంతో ఏడాదిలోనే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అదే డేటింగ్ యాప్. దీనిలో ఏడుగురు యునికార్న్ వ్యవస్థాపకులతో సహా 180 కంటే ఎక్కువ అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల నుంచి ఏంజెల్ ఫండిరగ్ రౌండ్లో 2.5 మిలియన్ల డాలర్లు (రూ.20,98,36,000) సేకరించినట్లు ఇటివల ప్రకటించారు. ఈ డేటింగ్ యాప్ స్టార్టప్ జూలియో 2023లో చిరంజీవ్ ఘాయ్, వరుణ్ సూద్ ప్రారంభించారు. ఈ భారతీయ డేటింగ్ యాప్ ప్రేమ, వివాహాం వంటి అంశాలకు వేదికగా ఉంటుంది. నిజమైన ప్రేమను కనుగొనడానికి వారికి సురక్షితమైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన సేవను అందించడమే మా లక్ష్యమన్నారు. జూలియో ప్రస్తుత కాలంలోని యువత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో తయారైందని ఇన్వెస్టర్లలో ఒకరైన లివ్స్పేస్ వ్యవస్థాపకుడు రమాకాంత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.