![](https://deekshamedia.com/wp-content/uploads/2025/01/02.jpg)
ప్రయాగ్రాజ్మహా కుంభమేళాకు జనాలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో జనవరి 29న (రెండవ షాహి స్నాన్) మౌని అమావాస్య సందర్భంగా రెండు కోట్ల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్నానం చేసిన వారి సంఖ్య గత 15 రోజుల్లో దాదాపు 14 కోట్లకు చేరుకుందని సనాతన బోర్డు పేర్కొంది. సోమవారం ఒక్క రోజే 1.55 కోట్ల మంది కుంభ స్నానం ఆచరించారు. ఇందులో 10 లక్షల కల్పవాసీలు ఉన్నారు. ఇక వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే 14.76 కోట్ల మంది స్నానం ఆచరించారని చెబుతున్నారు.. ఈ కుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జనవరి 23 నాటికి 10 కోట్ల మంది భక్తులు సందర్శించారు. ఈ ఉత్సవం ముగిసే సమయానికి మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాలలో ఒకటిగా నిలిచింది.