ఢిల్లీ స్థాయికి చేరిన ఏపీ డిప్యూటీ సీఎం ఇమేజ్
డ్యామేజ్ కు కుట్ర..?
పవన్ ఇమేజ్ తో.. టిఆర్పి రేటింగ్ లు పెరుగుతున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు… మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో పవన్ పాత్ర గురించి స్పెషల్ స్టోరీలు వడ్డీ వారిచాయి…. మరి ప్రింట్ మీడియాలో దీని గురించి… ఒక్క వార్త అయినా వచ్చిందా..?
ఢిల్లీ వెళ్లి.. ఫైనాన్స్, పారిశ్రామిక, రైల్వే, చలనచిత్ర.. రంగాలతో పాటు మొత్తం ఎనిమిది మంది సెంట్రల్ మినిస్టర్లను కలసి రాష్ట్రానికి నిధులను, ప్రాజెక్టులను ఇవ్వాలని కోరితే… ఒక్క ప్రధాన పత్రికలో అయినా… మెయిన్ పేజీలో దీని గురించి ప్రస్తావించారా???? దీనికి తోడు రాష్ట్ర అభివృద్ధి లో కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు ఎక్కడ పవన్ ఖాతాల్లోకి వెళ్తాయని.. భయపడి… పవన్ ఢిల్లీ వెళ్ళింది… నాగబాబు కోసం అని ప్రచారం… మొదలెట్టేశారు.
జనసేన సోషల్ మీడియా… బలంగా ఉంది కాబట్టి సరిపోయింది గాని… లేదంటే ప్రజారాజ్యం సమయంలో.. చిరంజీవి మీద ఒక వర్గం మీడియా చేసిన కుట్రలు… నేటికీ జనసేన మీద కొనసాగుతున్నాయా అన్న అనుమానం కలగక మానదు ??
రాష్ట్రంలో పవన్ ఏ కామెంట్ చేసినా.. అది చర్చకు దారి తీస్తుంది. ఇక పాలనా వ్యవహారాల్లో ఎక్కడా రాజీ ధోరణి కనిపించడం లేదు. ఆ మధ్య సోషల్ మీడియా సంఘటనల వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ మండిపడ్డారు. అంతేకాదు హోం శాఖ మంత్రి అనితను డైరెక్ట్‌గా చేతకాకపోతే.. తప్పుకో అన్నంత ధోరణిలో మాట్లాడారు. అది రాష్ట్రంలో సంచలనం కలిగించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో సోషల్ మీడియాలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై కేసులు పెట్టి.. కఠిన చర్యలు చేపట్టడంతో వైసీపీ నేతలు దారిలోకి వచ్చారు. ఇలా పవన్ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడా నెగ్గాలో అన్న తీరులో దూసుకుపోతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఏది చేసినా చర్చకు దారి తీస్తుంది.
తాజాగా పవన్ కల్యాణ్ ఢల్లీి టూర్‌పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు విషయమై ఢల్లీి వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాని పవన్ రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి వెళ్లినట్టు చెబుతున్నారు. పవన్ ఏది అయినా మొహం మీద చెప్పడం అలవాటు.. తన అన్నకు పదవి కావాలంటే.. ధైర్యంగా ముందుగానే చెప్పి డిల్లీ వెళ్లే గడ్స్ పవన్‌కు ఉన్నాయి. ఏదిఏమైనా ఇది రాజకీయం కాబట్టి విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేయడం సహజం..
పవన్ ఢల్లీి టూర్‌పై వస్తున్న విమర్శలపై నాగబాబుకూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ ఢల్లీి వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదని జనసేన నేత నాగబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢల్లీి పర్యటనపై వస్తున్న విమర్శల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడని, అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమేనని, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడని స్పష్టం చేశారు. ఇక అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతూ.. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదని నాగబాబు వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ నుంచి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వీరి స్థానంలో అధికారంలో ఉన్న మూడు పార్టీల్లోని ముగ్గురికి అవకాశం ఇవ్వాలని మొదట కూటమి నేతలు నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వత్తిడి పెరగటంతో ఇరువురికి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు పంపించాలని, ఒక పోస్టును బిజెపికి ఇవ్వాలా, జనసేనకు ఇవ్వాలా.. అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.
అనకాపల్లి నుంచి నాగబాబును ఎంపీ స్థానంలో పోటీ చేయించేందుకు ముందుగా నిర్ణయించుకున్నా ఆ సీటు పొత్తుల్లో బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో అక్కడి నుంచి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ తరపున గెలిచారు. సీటు నాగబాబు త్యాగం చేసినందుకు తగిన విధంగా సాయం చేయిస్తానని సీఎం రమేష్ ఇచ్చిన హామీ మేరకు నాగబాబును రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో బీజేపీ వారు ఉన్నారు.
నాగబాబుకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఆ పదవి వేరే వారికి వెళ్ళిపోవడంతో బీజేపీ కోసం ఎంపీ పదవి త్యాగం చేసిన నాగబాబుకి రాజ్యసభకు పంపించాలని డిమాండ్ కూడా జనసేనలో బలంగా ఉంది… ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ను.. ఈ అంశంపై ముడిపెట్టి… ఆయన ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు….! అందుకే దీనిపై నాగబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… 2014లో..పోటీ చేయకుండా త్యాగం చేశారు..ఆరు ఎంపీ సీట్లు 50 ఎమ్మెల్యే స్థానాలు అడగాల్సిన…2024 ఎన్నికల్లో…బిజెపి కోసం తెలుగుదేశం కోసం సీట్లను భారీగా తగ్గించుకొని..వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని…తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
…దీక్ష మీడియా ఎప్పుడో చెప్పినట్లు..బిజెపి కోసం పవన్ కాదు పవన్ వెనకే బిజెపి. అన్నయ్య ఎంపీ పదవి కోసం…చిటికేస్తే చాలు అలా వచ్చేసిద్ది… దానికోసం ఢిల్లీలో ఏడుగురు సెంట్రల్ మినిస్టర్ లను… పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తాడు? ఉపరాష్ట్రపతిని కలిసింది కూడా నాగబాబు కోసమేనని ప్రచారం చేస్తారేమో? ఫైనాన్స్ మినిస్టర్… రైల్వే మినిస్టర్లను… నాగబాబు ఎంపీ సీటుకు ఓటు వేయమని అడిగారని వితండవాదం కూడా చేయొచ్చు….!
అసలు రాజ్యసభ స్థానాలకి ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం..?
నెల్లూరు జిల్లా నుంచి బీద మస్తాన్‌రావు, గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యకు వైసీపీ నుంచి పదవులు ఇచ్చారు. వీరిలో బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణలు ఒకే సారి రాజీనామా చేయగా తరువాత కొద్ది రోజులకు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ప్రస్తుతానికి మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణలు టీడీపీలో చేరారు. కృష్ణయ్య మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. బీద మస్తాన్‌రావు తనకే రాజ్యసభ మళ్లీ ఇవ్వాలని టీడీపీని కోరినట్లు సమాచారం. లేదంటే పార్టీలోని వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబులో ఉంది.
బీద మస్తాన్‌రావుకు కాకుంటే ఎపి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న సానా సతీష్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. అందుకే నాగబాబుకు జనసేన కోటాలో ఇస్తే సరిపోతుందనే ఆలోచన చంద్రబాబులో ఉంది. కేంద్రం నుంచి ఎస్ అనిపించుకోవడమే తరువాయి. ఆ వెంటనే నాగబాబును రాజ్యసభకు పంపించ వచ్చు. జనసేన కోటాలో తన అన్న నాగబాబుకు కాకుంటే తనకు అన్ని విధాల అండగా నిలుస్తున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్‌కు రాజ్యసభ సీటు ఇప్పించుకోవాలనేది పవన్ ఎత్తుగడగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు ఎంపీ సీట్లకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకుడు కిలారు రాజేష్, సానా సతీష్, బీద మస్తాన్ రావుల మధ్య పోటీ ఉంది. ఒక సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ రేస్‌లో ఉన్నట్లు సమాచారం.
దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి… 🙏